నవతెలంగాణ – శాయంపేట
పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య గెలుపు కోరుతూ సోమవారం పార్టీ మండల నాయకులు శాయంపేట గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీ పథకాలని గ్రామస్తులకు వివరించారు. బిఆర్ఎస్, బిజెపి పార్టీలకు ప్రజలే ఈనెల 13న జరగనున్న పార్లమెంటు ఎన్నికలలో ఓట్లతో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. దేశంలో రాహుల్ గాంధీ ప్రధానిగా అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చింతల రవిపాల్, బాసాని శాంతా రవి, చంద్రమౌళి, మారపల్లి కట్టయ్య, రాజు, రఫీ, ప్రపంచరెడ్డి, రామస్వామి, సదానందం పాల్గొన్నారు.