నవతెలంగాణ -వలిగొండ: మండల పరిధిలోని మొగిలి పాక గ్రామంలో మత్స్యగిరి దేవస్థాన మాజీ చైర్మన్ ముద్దసాని కిరణ్ రెడ్డి ఆధ్యర్యంలో భువనగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డి గెలుపు కోసం సుమారు 100 మంది కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు తుమ్మల వెంకట్ రెడ్డి,గ్రామశాఖ అద్యక్షుడు బిక్షపతి, సింగిల్ విండో వైస్ చైర్మన్ బిక్షపతి, పాల సంఘం ఛైర్మెన్ సత్తయ్య,ఉప సర్పంచ్ నర్సింహా, మాజీ సర్పంచ్ శంకరయ్య, మాజీ ఎంపీటీసీ శ్రీలత రమేష్,మాజీ ఉప సర్పంచ్ విష్ణు చారి, జడిగే మహేష్, బిమనబోయిన మచ్చెందర్, జడిగే స్వామీ, ఖాసీం కార్యకర్తలు పాల్గొన్నారు.