బీఆర్ఎస్ నాయకుల ఇంటింటి ప్రచారం

నవతెలంగాణ – కమ్మర్ పల్లి

మండలంలోని ఆయా గ్రామాల్లో శనివారం బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. బూత్ ఇంచార్జిల ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ ఓటర్లకు కరపత్రాలను పంపిణీ ప్రచారాన్ని నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో టిఆర్ఎస్ నాయకుల ప్రచారం జోరుగా సాగుతుంది.ఈనెల 13న జరిగే  ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల అమలులో విఫలమైన విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూ ప్రచారాన్ని నిర్వహించారు. ఎంపీగా బాజిరెడ్డి గోవర్ధన్ ను గెలిపిస్తే అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారంలో ముందుంటారని, ఎంపీగా అరవింద్, ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి మండలానికి చేసిందేమీ లేదని ఇంటింటి ప్రచారంలో ఓటర్లకు వివరించారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి తోడుగా  ఎంపీగా బాజిరెడ్డి గోవర్ధన్ గెలిపిస్తే ప్రజల సమస్యల పరిష్కారంలో వారిద్దరు ముందుంటారని, కారు గుర్తుకు ఓటు వేసి ఎంపీగా బాజిరెడ్డి గోవర్ధన్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. బాల్కొండ నియోజకవర్గం లోని రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల్లో బిఆర్ఎస్ నాయకులు  ఉపాధి పని ప్రదేశంలో కూలీలను కలిసి ప్రచారాన్ని నిర్వహించారు.