
హుస్నాబాద్ పట్టణంలోని శాంతినగర్ లో శుక్రవారం రెండవ వార్డ్ కౌన్సిలర్ బోజు రామాదేవి రవీందర్ ఆధ్వర్యంలో బి అర్ ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం చేపట్టారు. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినిపల్లి వినోద్ కుమార్ కారు గుర్తుకు ఓటేయాలని ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, వైస్ చైర్మన్ ఐలేని అనిత, కౌన్సిలర్లు కొంకటి నల్లిని దేవి, వాల సుప్రజ, పెరిక భాగ్యరెడ్డి ,బొజ్జ హరీష్ , మొగిలి, పాక రాజేష్ , కోహెడ రేఖ, ఎర్రవల్లి మమత ,రక్షిత , రవళి తదితరులు పాల్గొన్నారు.