
మండల కేంద్రంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇంటింటి ప్రచారం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఓటర్ వద్దకు వెళ్ళి కాంగ్రెస్ ఆరు గ్యారంటీ లను వివరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి తాడిపత్రి జీవన్ రెడ్డి నీ గెలిపించాలని, గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు వెంకటేశ్వర్ రావు, మాజీ సర్పంచ్ రాజేందర్, అలిం, వడ్ల భూమన్న, మామూళ్ల శ్రీనివాస్, అరిఫ్, లక్ష్మినారాయణ, స్వామి తదితరులు పాల్గొన్నారు.