నవతెలంగాణ -వలిగొండ రూరల్: కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో భాగంగా మండలంలోని వెంకటాపురం గ్రామ పంచాయతీ పరిధిలో గల మత్స్యగిరి కాలనిలో బుధవారం మాజీ సర్పంచ్ కొత్త వెంకటేశం ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలను ఓటర్లకు వివరించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ కొత్త వెంకటేశం మాట్లాడుతూ భువనగిరి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి భువనగిరి ఖిల్లాపై కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు బరిశెట్టి వెంకటేశం నాయకులు కొత్త జంగయ్య, జక్కల రోశయ్య, ప్రభాకర్, శ్రీను, మహేష్, మధు, ఏలం శ్రీశైలం, మెడబోయిన మమత కాడిగళ్ళ మమత, చిలుముల చంద్రకళ, కంబాలపెళ్లి అండాలు, ఏలం లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.