
కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో బోయినపల్లి వినోద్ కుమార్ కారు గుర్తుకు ఓటు వేయాలని బుధవారం హుస్నాబాద్ లో మున్సిపల్ ఛైర్మన్ ఆకుల రజిత వెంకన్న ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిని అధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎండి అన్వర్, వైస్ చైర్మన్ ఐలేని అనిత శ్రీనివాస్ రెడ్డి , కౌన్సిలర్లు బోజు రమాదేవి రవీందర్, బొజ్జ హరీష్ ,పేరుక భాగ్యరెడ్డి, శ్రీమతి వాలా సుప్రజా నవీన్ రావు, నిర్మల, బత్తుల జగ్జీవన్,యండి ఫయజ్, మహిళా నాయకులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.