నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలం కేంద్రంలో శుక్రవారం బిఆర్ఎస్ పార్టీ మహిళ ప్రతినిధులు నిజామాబాద్ లోక్ సభ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాజీరెడ్డి గోవర్ధన్ కు మద్దతుగా ఇంటింటి ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధ పాలనను, వంద రోజుల్లో అమలు చేస్తామని మహిళలకు ఇచ్చిన హామీలను ఐదు నెలలు గడుస్తున్నా అమలు చేయకుండా ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య, దాటవేత ధోరణిని మహిళా ఓటర్లకు వివరిస్తున్నారు.బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కరపత్రాలను ఓటర్లకు అందజేశారు. ప్రజల పక్షాన నిలబడి సమస్యల పరిష్కారం కోసం పోరాడే బాజిరెడ్డి గోవర్ధన్ ను కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.నాయకులు కూడా గ్రామంలో బూత్ ల వారిగా స్థానిక నాయకులు టీంలను ఏర్పాటు చేసుకొని ఉదయం, సాయంత్రం ప్రచారాన్ని కొనసాగించారు. ఇంటింటికి వెళ్లి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, అమలు చేయకుండా సమయం పొడిగిస్తూ దాటవేస్తున్న తీరును ప్రజలకు వివరిస్తున్నారు.ప్రజల పక్షాన సమస్యల పరిష్కారం కోసం కొట్లాడే బాజిరెడ్డి గోవర్ధన్ ను ఎంపీగా గెలిపించి పార్లమెంట్ కు పంపించాలని ఓటర్లకు విన్నవించారు.