యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం

నవతెలంగాణ -పెద్దవూర
మండలం లోని చలకుర్తి గ్రామంలో నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి ఆదేశాల మేరకు నల్గొండ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి గెలుపు కోసం శుక్రవారం ఉదయం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటి తలుపు తడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వివరించారు. అలాగే ఈ నెల 13వ తేదీన జరగబోవు పార్లమెంట్ ఎన్నికల్లో 3వ వరుస క్రమంలో గల హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీ అమలు చేయుచున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరిస్తూ ఇంటింటికి కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తుమ్మల పల్లి లలిత వెంకట్ రెడ్డి,తుమ్మలపల్లి వెంకట్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి, గిరిబాబు, భాస్కర్ రెడ్డి,పిల్లి శంకర్, గోదల యాదిరెడ్డి, గగ్గేనపల్లి సాంబా రెడ్డి, సుధాకర్ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి, గిరిబాబు, భాస్కర్ రెడ్డి,పిల్లి శంకర్, గోదల యాదిరెడ్డి, గగ్గేనపల్లి సాంబా రెడ్డి.తదితరులు పాల్గొన్నారు.