ఇంటింటికి కుల గణన స్టిక్కర్లు..

House to house caste enumeration stickers..నవతెలంగాణ – డిచ్ పల్లి
‘రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా చేపట్టిన కుల గణన” డిచ్ పల్లి సుద్దపల్లి, నడ్పల్లి ఇందల్ వాయి మండలాల పరిధిలోని ఆయా గ్రామాలలో  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన లో బాగంగా ప్రతి ఇళ్లకు స్టిక్కరింగ్ కార్యక్రమం బుధవారం చేపట్టారు. గురువారం మిగిలిన ఇళ్లకు స్టిక్కరింగ్ చేపట్టనున్నట్లు అదికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో డిచ్ పల్లి ప్రత్యేక అధికారి యోహాన్ (డిస్టిక్ లేబర్ ఆఫీసర్), ఎంపీడిఓ రవీందర్, లక్ష్మారెడ్డి, ఎంపీఓలు శ్రీనివాస్ గౌడ్, రాజ్ కాంత్ రావు,పంచాయతీ కార్యదర్శులు కవిత, బాలకృష్ణ,కారోబార్లు సురేష్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.