– బీఆర్‌ఎస్ చేవెళ్ల ఎమ్మెల్యే అభ్యర్థి కాలె యాదయ్య
నవతెలంగాణ-శంకర్‌పల్లి
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమత్రి కేసీఆర్‌కే దక్కుతుందని బీఆర్‌ఎస్ చేవెళ్ల ఎమ్మెల్యే అభ్యర్థి కాలే యాదయ్య అన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్‌పల్లి మండలంలోని మిర్జాగుడ, ఇంద్రారెడ్డి నగర్ కాలనీలో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీి తిరిగి కారు గుర్తుకే ఓటు వేయాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు, అభివృద్ధి పనులు చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షులు మిర్జాగుడ సర్పంచ్ రవిందర్‌గౌడ్, శంకర్‌పల్లి మార్కెట్ చైర్మెన్ వైస్ చైర్మెన్ పాపారావు, కుర్మ వెంకటేశ్, మిర్జాగుడ ఉప సర్పంచ్ శాంతి కిషన్ సింగ్, వాటి సభ్యులు వై.చిట్టెమ్మ, వై.ప్రవీణ్ కుమార్, శారద, పార్టీ గ్రామాధ్యక్షులు అంజనేయులు, గోపాల్‌నాయక్, బి.తిరుపతి, సీహెచ్.కుమార్, డప్పు శీను, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.