నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో బీఏ, బీఎస్సీ, బీకాం, బీకాం ఒకేషనల్, బీకాం ఆనర్స్, బీఎస్‌డబ్ల్యూ, బీబీఏ, బీసీఏ, బీబీఎం, బీసీఏ కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) మూడో విడతకు సంబంధించి శనివారం సీట్ల కేటాయింపు ఉంటుంది. ఈ మేరకు దోస్త్ కన్వీనర్, ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మూడో విడతకు 80,312 మంది విద్యార్థులు వెబ్‌ఆప్షన్లను నమోదు చేశారని తెలిపారు. మొదటి, రెండు విడతల్లో కలిపి 93,214 మంది విద్యార్థులు కాలేజీల్లో రిపోర్టు చేశారని వివరించారు.