దోస్తు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

నవతెలంగాణ – తుర్కపల్లి

మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన యాట గోవర్ధన్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా మాదాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన,1993_94 సంవత్సర పదవ తరగతి విద్యార్థులు ఈ విషయాన్ని తెలుసుకొని ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని తమకు తోచిన విధంగా కొంత ఆర్థిక సహాయం గురువారం భార్యకు అందజేశారు. అనంతరం ఆ కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలుస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలోరాజుచారి,జంగయ్య,బ్రహ్మచారి,సదానందం,నవీన్,కన్యకా పరమేశ్వరి, ధనలక్ష్మి, సువర్ణ, ఉమారాని,తదితరులు పాల్గొన్నారు.