– డివిజన్ పరిధిలోని అన్ని మండలాల లో రోడ్లు మరమ్మత్తులు చేయించాలి
– నర్సాపూర్ లో పీ జీ కళాశాలకు స్థలం కేటాయించాలి
– రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలనీ సీపీఎం డిమాండ్
– CPM ఏరియా మహాసభలో జిల్లా కార్యదర్శి ఏ. మల్లేశం.
నవతెలంగాణ — నర్సాపూర్
అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని ,స్థానిక సమస్యలు పరిష్కరించాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఏ.మల్లేశం అన్నారు. ఆదివారం నర్సాపూర్ మండల కేంద్రంలో నీ యాదవ ఫంక్షన్ హాలు లో జరిగిన నర్సాపూర్ ఏరియా 2 మహాసభ జరిగిన సందర్భంగా ఆయన హాజరై మాట్లాడారు. గత 3 సంవత్సరాల కాలం లో జరిగిన పార్టీ కార్యక్రమాలు,అనుభవాలను సమీక్షించుకుని భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించుకోవడం జరిగింది.అలాగే ఈ మహాసభ సందర్భంగా పార్టీ 4 నాలుగు తీర్మలను చేసుకోవడం జరిగింది. మొదటిది అర్హులైన పేదలు నర్సాపూర్ పట్టణ కేంద్రము లో ఉన్నవారిని గుర్తించి పేదలకు డబుల్ బెడ్ రూం లు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రెండవది నర్సాపూర్ డివిజన్ పరిధిలో కొండపోచమ్మ కాలువ ప్రభుత్వం నిర్మాణం పనులు ప్రారంభించింది.త్రిబులార్ లో భూములు కోల్పోతున్న రైతుల కు న్యాయం చేయాలని అన్నారు.నష్ట పరిహారం ఇవ్వక పోతే రైతులు తీవ్రంగా నష్టపోతారని వారు అన్నారు. ప్రభుత్వం గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించి రైతుల సమక్షం లో నష్టపరిహారం నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు.భూమికి భూమి,ఇంటికి ఇల్లు,ఇంటికో ఉద్యోగం 2013 భూ సేకరణ చట్టం ప్రకారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
మూడవది.పీ జీ కళాశాలకు ప్రభుత్వం మంజూరు చేసిన ప్పటికి ఇప్పటి వరకు స్థలం కేటాయించలేదు.ఇది ప్రభుత్వ నిర్లక్షం. పీ జీ కాలేజీ లేకపోవడం వల్ల కళాశాలలో ఉన్న కోర్సులు అన్ని ఎత్తి వేస్తున్నారు.దీంతో నర్సాపూర్ డివిజన్ పరిధిలోని విద్యార్థులు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు.ప్రభుత్వం వెంటనే స్పందించి పీ జీ కళాశాలకు స్థలం కేటాయించి నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.నాలుగవ తీర్మనం నర్సాపూర్ ఏరియా పరిదిలో పలు ప్రాంతాల్లో రోడ్లు లేవు,అంత గుంత ల మయంగా ఉన్నాయి.వర్షాలు పడితే రోడ్లు అన్ని పాడై గ్రామాలకు బసులు వెళ్లడం లేదు.దీంతో ఇతర ప్రాంతాలకు చదువు కోసం వెల్లె విద్యార్థులు అవస్థలు ఎదుర్కొంటున్నారు.
ఆటోలలో వెళ్ళాలన్న తీవ్ర అవస్థలు పడుతున్నారు.అన్ని మండలాల పరిధిలో రోడ్లు మరమత్తులు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రాబోయే కాలంలో ఈ డిమాండ్ల పరిష్కారం కోసం పనిచేస్తామని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు నర్సమ్మ,మల్లేశం,బస్వరాజు,ఏరియా కమిటీ కార్యదర్శి కడారి నాగరాజు ,జిల్లా కమిటీ సభ్యులు మల్లేశం, వాసు ,నాయకులు గౌరయ్య,దాసు,పోచయ్య, సాయిలు,రాములు ,తదితరులు పాల్గొన్నారు