మణిపూర్ లో డబుల్ ఇంజన్ సర్కార్  విఫలం

– సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి వెంకట్ గౌడ్ డిమాండ్
నవతెలంగాణ -తాడ్వాయి
మణిపూర్ రాష్ట్రంలో గత రెండు నెలలుగా రెండు తెగల మధ్య అరాచకాలు సాగుతున్న  హింస ఖండా జరుగుతున్న అక్కడ పాలించే పాలకులు డబుల్ ఇంజన్ సర్కార్ పూర్తిగా విఫలమైందని సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి వెంకట్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మణిపూర్ లో అనేక మంది మహిళలను అత్యాచారం చేసి ఊరేగింపులు చేస్తూ హత్యలు అత్యాచారం చేస్తున్నా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చూస్తూ ఉండిపోయాయి తప్ప ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఈ దేశానికి సిగ్గుమాలిన చర్య అని  అన్నారు. దేశం సిగ్గుపడే విధంగా మణిపూర్లో హింసలు జరుగుతున్నాయని హింసకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి వెంటనే మణిపూర్ లో హింస చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మహిళను నగ్నంగా ఊరేగించిన వారిని, అత్యాచారం చేసిన వారిని ఉరితీయాలని డిమాండ్ చేశారు.  మణిపూర్ రాష్ట్రంలో అల్లర్లు కట్టడి చేసి శాంతియుత పరిస్థితులు నెలకొల్పే విధంగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్తే తప్ప బయటకు స్పందించని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ట్విట్టర్ లో వాట్సాప్ లలో ఫేస్బుక్లలో వస్తే తప్ప బయటకు పెట్టని వీడియోలను ఆ రాష్ట్రంలో ఇంకా ఏవిధంగా పరిస్థితులు ఉన్నాయో తెరవడం లేదన్నారు. మణిపూర్లో అరాచక పరిస్థితుల నుండి ప్రజలను కాపాడాలని సీపీఐ(ఎం) పార్టీ కామారెడ్డి జిల్లా కమిటీ తరపున డిమాండ్  చేస్తున్నాన్నారు.