రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో రాబోతున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ‘స్టెప్పా మార్..’కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సెకెండ్ సింగిల్ ‘మార్ ముంత చోడ్ చింత..’ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. లేటెస్ట్‌గా మేకర్స్ థర్డ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. ‘క్యా లఫ్డా..’ సాంగ్‌ను ఈనెల 29న రిలీజ్ చేయబోతున్నారు. రామ్, కావ్యా థాపర్ రొమాంటిక్ కెమిస్ట్రీని వండర్‌ఫుల్‌గా ప్రజెంట్ చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ చాలా ఎట్రాక్టీవ్‌గా ఉంది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ సినిమాలో సంజరు దత్ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు. ‘రామ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ విశేష ప్రేక్షకాదరణతో సంచలన విజయం సాధించింది. దీనికి సీక్వెల్‌గా ఇదే కాంబినేషన్‌లో ఇప్పుడు ‘డబుల్ ఇస్మార్ట్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ అందరిలోనూ మరింత క్యూరియాసిటీని పెంచింది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తన హీరోలను దర్శకుడు పూరీ జగన్నాథ్ స్క్రీన్‌పై చూపించే తీరు చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ చిత్రంలోనూ ఆయన హీరో రామ్‌ని వినూత్నంగా ప్రజెంట్ చేయబోతున్నారు. అలాగే ఇందులో బాలీవుడ్ నటుడు సంజరుదత్ ప్రతినాయకుడిగా పవర్‌ఫుల్‌రోల్ చేస్తున్నారు. రామ్, సంజరుదత్ కాంబోలో వచ్చే సీన్స్ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తాయనటంలో సందేహం లేదు’ అని చిత్ర యూనిట్ తెలిపింది. అలీ, గెటప్ శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: పూరి జగన్నాథ్, నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్, సీఈఓ: విషు రెడ్డి, సంగీతం: మణి శర్మ, సినిమాటోగ్రఫీ: సామ్ కె నాయుడు, జియాని జియాన్నెలి, స్టంట్ డైరెక్టర్: కేచ, రియల్ సతీష్.