
మహిళా సంఘాల సభ్యులు బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలతో స్వయం ఉపాధి అవకాశాలు పొందేలా అవగాహన కల్పించాలని డీపీఎం నూకల శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం పట్టణ కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో వివో ఏ లకు డిపిఎం ఆధ్వర్యంలో శిక్షణ అందజేశారు ఈ సందర్భంగా డిపిఎం మాట్లాడుతూ ప్రతి గ్రామంలో 80 యూనిట్లను గుర్తించి వారికి జీవనోపాధి కి ఐకెపి ద్వారా బ్యాంకులలో రుణాలను ఇప్పించాలన్నారు. తీసుకున్న రుణాలతో స్వయం ఉపాధి పొందేలా అవగాహన కల్పించాలన్నారు. ఈ శిక్షణలో నిజామాబాద్ జిల్లా ఏపీఎం సరోజిని, సీసీలు పురస్తు నరేష్, భాస్కర్, సాయిలు, సుమలత తో పాటు వివో ఏ లుపాల్గొన్నారు.