పారిశుధ్యం పనుల్లో అలసత్వం వహించి వద్దని,వైద్యారోగ్య శాఖ,పంచాయితి సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని డీపీవో చంద్రమౌళి సూచించారు. మంగళవారం రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండలంలో పర్యటన ఉన్న నేపధ్యంలో డీపీవో చంద్రమౌళి వినాయక పురం,నారాయణ పురం,అశ్వారావుపేట పంచాయితీల్లో సోమవారం పర్యటించి పారిశుధ్యం పనులను పరిశీలించారు.నీటి నిల్వ ప్రాంతాల్లో మట్టి నింపడం,బ్లీచింగ్ చల్లడం చేయాలని ఆయా కార్యదర్శులకు ఆదేశాలు ఇచ్చారు. ఆయన వెంట డీఎల్ పీవో బీటీ టీవి రమణ,స్థానిక కార్యదర్శులు పాల్గొన్నారు.