మండలంలోని రేండ్లగూడ, కిష్టాపూర్,మొర్రిగూడ, ఇందనపల్లి గ్రామాలలో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని పరిశుద్ధ పనులను పరిశీలించి తగు సూచనలు చేశారు. రేండ్లగూడలోని డంపింగ్ యార్డ్ ను ఆయన పరిశీలించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ, పంచాయతీ కార్యదర్శులు అందరూ పరిశుద్ధ విషయంలో అప్రమత్తంగా ఉండి సిబ్బందితే ఎప్పటికప్పుడు గ్రామాల్లోని చెత్తను ఎత్తివేస్తూ వాడలను శుభ్రంగా ఉంచాలన్నారు.ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శిలకు పలు సూచనలు చేశారు.ఆయన వెంట ఎంపీడీఓ ఠాగూర్ శశికళ, ఎంపీఓ జలంధర్, ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులు ఎల్. శ్రీనివాస్ నాయక్ ,చంద్రమౌళి తదితరులున్నారు.