
నవతెలంగాణ – అశ్వారావుపేట
స్థానిక పాలక వర్గాల పాలనా కాలం మంగళవారం తో ముగియడంతో ప్రభుత్వం పంచాయితీలకు ప్రత్యేక అధికారులను నియమించింది. మేజర్ పంచాయితీలకు జిల్లా స్థాయి అధికారులను,ఓ మోస్తరు జనాభా ఉన్న పంచాయితీలకు డివిజన్ స్థాయి అధికారులను,చిన్న పంచాయితీలకు మండల స్థాయి అధికారులను నియమించింది.అశ్వారావుపేట మండలంలో మొత్తం 30 పంచాయితీలకు గాను మూడు పంచాయితీలకు ఒక్కో అధికారిని కేటాయించారు.నియోజక వర్గం కేంద్రం,మండల కేంద్రం అయిన మేజర్ పంచాయితీకి జిల్లా పంచాయితీ అధికారి రాజీవ్ కుమార్ ను నియమించారు.ఐటిడిఎ డీ ఈ ఎం.రామిరెడ్డి అనంతారం,గాండ్ల గూడెం,మల్లాయిగూడెం లకు ప్రత్యేక అధికారిగా వ్యవహరించనున్నారు.ఎఫ్ ఆర్ ఓ మురళి కి వేదాంతపురం,రామన్నగూడెం కేటాయించారు.తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్ కు పేరాయిగూడెం,నారంవారిగూడెం కాలనీ,ఎం.పి.డీ.ఒ శ్రీనివాసరావు కు వినాయకపురం,కొత్త మామిళ్ళ వారి గూడెం,ఊట్లపల్లి,ఎం.పి.ఓ పి.సీతారామరాజు కు ఆసుపాక,నారాయణపురం,నారంవారిగూడెం,డి టి రేనా సుచిత్ర కు గుర్రాల చెరువు,పాత అల్లి గూడెం,వ్యవసాయాధికారి వై.నవీన్ కు బచ్చు వారి గూడెం,గుమ్మడవల్లి,కోయ రంగాపురం,మిషన్ భగీరథ ఇంట్రా ఎ.ఇ లక్ష్మి కి అచ్యుతాపురం,మద్దికొండ,ఐ బి ఎ.ఇ కె ఎన్ బి క్రిష్ణ కు పాత రెడ్డిగూడెం,తిరుమలకుంట,ఉద్యాన శాఖ అధికారి సందీప్ కు కన్నాయిగూడెం,కావడి గుండ్ల,నయాబ్ తహశీల్దార్ సి.హెచ్ రామక్రిష్ణ కు జమ్మిగూడెం,కేసప్పగూడెం,పశుసంవర్ధక శాఖ వైద్యురాలు స్వప్న కు మొద్దులు మడ,నందిపాడు,దిబ్బ గూడెం పంచాయితీలు కేటాయిస్తూ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసారు.