ప్రజా పాలన విజయోత్సవాల కార్యక్రమంలో ఉపాధి హామి పథకం కింద చేపట్టిన పనులు నిర్దేశించిన సమయంలోనే పూర్తిచేయాలి డిపిఓ అన్నారు. మంగళవారం మండలంలోని బిరవెల్లి గ్రామాల్లో ఎంపీడీవో లక్ష్మీ కాంతారావు తో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. రైతుల వ్యక్రిగత పనులు పశువుల పాక, గొర్రెల పాక, నర్సరీ, ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ ఇంకుడు గుంతలు, రోడ్ల నిర్మాణం, పండ్ల తోటల పెంపు వంటి పనులను మార్చి 31 లోగా పనులు పూర్తిచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపిఓ అజీజ్ ఖాన్,ఏపీఓ లక్ష్మారెడ్డి, ఏపిఎం మాధురి, టి ఏ రోజ, పోశెట్టి పంచాయతీ కార్యదర్శులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.