ప్రజలకు చేసిన సేవలే శిరస్థాయిగా నిలుస్తాయి: డిపిఓ వెంకటేశ్వరరావు

నవతెలంగాణ – జన్నారం
విధి నిర్వహణలో ప్రజలకు చేసిన చేవలే స్థిరస్థాయిగా నిలుస్తాయని  మంచిర్యాల డిపిఓ వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం జన్నారం మండల ఎంపీడీవో ఠాగూర్ శశికళ  పదవి విరమణ సందర్భంగా పాల్గొని మాట్లాడారు. ముందుగా వివిధ గ్రామాలకు చెందిన కార్యదర్శులు, డిపిఓ వెంకటేశ్వరరావు తాసిల్దార్ రాజ మనోహర్ రెడ్డి ఎం ఈ ఓ విజయ్ కుమార్, బదిలీపై  వెళ్లిన ఈవోపీఆర్డి రమేష్ ఎంపీడీవో శశికళ  దంపతులను  శాలువాతో సత్కరించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ జన్నారం మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపి ఉత్తమ ఎంపీడీవో గా కలెక్టర్ కుమార్ దీపక్ చేతుల మీదుగా  అవార్డు అందుకున్నారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ సహజమే అన్నారు. కానీ ప్రజలకు చేసిన సేవలే చిరస్థాయిగా నిలుస్తాయి అన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శుల సంఘం మండల అధ్యక్షులు లకావత్ శ్రీనివాస్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చిలువేరు నరసయ్య, వివిధ గ్రామాలకు చెందిన కార్యదర్శులు, లతా సరిత, శ్రీ పాల్ వినోద్ కుమార్ కరుణ  విశ్వ శ్రీ వరలక్ష్మి రమేష్ శ్రీకాంత్ మహేష్ విజయ్ కుమార్, రాహుల్ రమేష్ సాగర్ రాజేశ్వరి లావణ్య మధు కుమార్, తో పాటు ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.