నవతెలంగాణ – డిచ్ పల్లి
యూనివర్సిటీ గొప్ప అనుభవాన్ని స్తుందని ఈ అనుభవంతో సమాజంలో బాధ్యత గల పౌరులుగా ఉండాలని అశాఖ విభాగాధిపతి డాక్టర్ ఏ పున్నయ్య అన్నారు. శనివారం తెలంగాణ యూనివర్సిటీ లో అర్థశాస్త్ర విభాగంలో జరిగిన ఫైనల్ ఇయర్ విద్యార్థుల వీడ్కోలు సమావేశానికి విభాగాధిపతి డాక్టర్ ఏ.పున్నయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీ అర్థశాస్త్ర విభాగం విశాలమైనదని 200 మంది పీజీ విద్యార్థులు, పదిమంది పరిశోధక విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని పేర్కొన్నారు. అర్థశాస్త్ర విభాగంలో నేటికీ విద్య అభ్యసించిన విద్యార్థులు అనేకమంది డిగ్రీ కాలేజీ లెక్చరర్ గా, జూనియర్ కాలేజీ లెక్చరర్ గా, బ్యాంకు ఆఫీసర్లుగా అనేక ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలలో నేటికి స్థిరపడ్డారని తెలిపారు.మారుతున్న ఆర్థిక సమాజంలో అర్థశాస్త్రానికి సరైన,విలువ గుర్తింపు ఉందని విద్యార్థులు కష్టపడి చదవాలని తెలియజేశారు.ముఖ్యఅతిథిగా హాజరైన కళాశాల ప్రిన్సిపల్ ప్రిన్సిపాల్ సిహెచ్ ఆరతి మాట్లాడుతూ వనరుల నిర్వహణ, పేదరికం, నిరుద్యోగం, ధరల పెరుగుదల మొదలుకొని, అంతర్జాతీయ వ్యాపారం లాంటి దృగ్విషయాలు అర్థం చేసుకోవాలంటే అర్థశాస్త్ర భావనలు పట్ల అవగాహన ఉండాలన్నారు. సీనియర్ ప్రొఫెసర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ 18 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ అర్థశాస్త్ర విభాగం నాతో ప్రారంభం కావడం నా అదృష్టంగా భావిస్తున్నానని అనేకమంది విద్యార్థులు పరిశోధనలు పూర్తి చేసి పీహెచ్డీ అవార్డు చేసినారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ డాక్టర్ టీ.సంపత్, డాక్టర్ స్వప్న, డాక్టర్ శ్రీనివాస్ డాక్టర్ దత్తాహరి లు సందేశాలు ఇచ్చారు. శ్రీశైలం, రాజేందర్, సంధ్య, దివ్య, సతీష్, సందీప్ మృణాళిని, వర్ష, ప్రతిజ్ఞ తదితర విద్యార్థులు పాల్గొని అధ్యాపకులను సన్మానించినారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినారు.