
వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను, రికార్డుల నిర్వహణ, పరిశుభ్రత తదితర అంశాలపై ఆసుపత్రిలో పర్యటించి, పలు వివరాలను ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న సేవలపై ఆయన వైద్యాధికారులను అభినందించారు.సుమారు లక్ష 40 వేల మందికి ఓపి సేవలను ఏడాదిలో అందించినట్లు వైద్యులు ఆయనకు తెలిపారు. ఆయన వెంట వేములవాడ, సిరిసిల్ల సూపరిండెంట్లు డాక్టర్ రేగులపాటి మహేష్ రావు, మురళీధర్ రావు, వైద్యాధికారులు సంతోష్ చారి, తిరుపతి, నిషాత్ సల్మా, సుభాషిని వైద్య సిబ్బంది ఉన్నారు.