
ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ,వైద్యుల సూచనలు సలహాలు పాటించాలని పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు అమృత్ రామ్ రెడ్డి అన్నారు. పట్టణంలోని గంగ హాస్పిటల్ యందు ఆదివారం ఆర్మూర్ ప్రెస్ క్లబ్, నవనాతపురం ప్రెస్ క్లబ్ సభ్యులకు ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు ప్రెస్ క్లబ్ ల అధ్యక్షులు అధ్యక్షులు నెమలి ప్రశాంత్, మంచిర్యాల నరేందర్ లు మాట్లాడుతూ వైద్యులు ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా 71 రక్త పరీక్షలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు సో క్కల తిరుపతి ,రాకేష్, సునీల్ పురుషోత్తం , చరణ్ గౌడ్ ,విన్సెంట్ ,రితీష్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.