ప్రభుత్వ ఆరోగ్యశాఖ రాష్ట్ర చైర్మన్ గా డాక్టర్ బి మధు శేఖర్

నవతెలంగాణ – ఆర్మూర్ 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ రాష్ట్ర చైర్మన్ గా పట్టణానికి చెందిన ఎం జె హాస్పిటల్ వైద్యులు, చేయూత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బి మధుశేఖర్ గురువారం నియామకం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన నియామకం పట్ల డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్, పట్టణ ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ నాగరాజు, టీఎన్జీవో అంగన్వాడి వెల్పర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు తార, పట్టణంలోని ఆశ సిరి లైఫ్, వసంత జ్యోతి, బాలరాజ్ మెమోరియల్ వైద్యులు శేఖర్ రెడ్డి, లింభారెడ్డి, భాను రామగిరి, వసంతకుమారి, రాకేష్ కుమార్ తదితరులు హర్షం వ్యక్తం చేసినారు.