డాక్టర్‌ బాబు జగ్జీవన్‌రామ్‌ సేవలు చిరస్మరణీయం

– అంబేద్కర్‌ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బేగరి రాజు
నవతెలంగాణ-మొయినాబాద్‌
డాక్టర్‌ బాబు జగ్జీవన్‌రామ్‌ సేవలు చిరస్మరణీయం అని అంబేద్కర్‌ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బేగరి రాజు అన్నారు. గురువారం మొయినాబాద్‌ మండల పరిధిలోని హిమత్‌ నగర్‌ చౌరస్తాలో అంబేద్కర్‌ యువజన సంఘం హిమత్‌ నగర్‌ గ్రామ కమీటీ అధ్యక్షులు కంజర్ల శేఖర్‌ ఆధ్వర్యం లో డాక్టర్‌ బాబు జగ్జీవన్‌ రామ్‌ 37వ వర్థంతి ఘనంగా నిర్వహించారు. ముందుగా మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లా డుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి దళితుల ధ్రువతార డాక్టర్‌ బాబు జగ్జీవన్‌ రావు అని కొనియాడారు. ఆయన ఆశయ సాధ నకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పల్లగొల్ల అశోక్‌ యాదవ్‌, పూడూర్‌ రాజు, మల్లేపల్లి ప్రకాష్‌, మాల శ్రీను, కామారెడ్డి కుమార్‌, పూడూరు ప్రసాద్‌, కుశంగుళ్ల నవీన్‌, షాబాద్‌ ప్రవీణ్‌, షాబాద్‌ సందీప్‌, అంబేద్కర్‌ యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు.