గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసిన డా.బాబురావు

Dr. Baburao gave vaccinations for the prevention of Galikuntu diseaseనవతెలంగాణ – మోపాల్ 

సోమవారం రోజున  పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా రూరల్, మోపాల్ మండలంలోని వివిధ గ్రామాలలో  పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించినట్లు  మండల పశువైద్య అధికారి డా.కె. బాబురావు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు (459) పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగింది. అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది భాస్కర్, శ్రీనివాస్, సత్యలింగం, సజ్జద్, గోపాలమిత్ర యూసఫ్ తదితరులు పాల్గొన్నారు.