నవతెలంగాణ – మద్నూర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలన తీసుకురావడమే కాకుండా ప్రత్యేక అధికారులుగా గజిటెడ్ అధికారులు ఉండాలని నిబంధన తీసుకురావడం డాక్టర్ బండి వార్ విజయ్ కి మద్నూర్ మేజర్ గ్రామపంచాయతీ తో పాటు అంతాపూర్ గ్రామపంచాయతీ బాధ్యతలు అప్పగించారు. రెండో పంచాయతీ ప్రత్యేక అధికారిగా డాక్టర్ విజయ్ శనివారం నాడు అంతాపూర్ గ్రామపంచాయతీలో బాధ్యతలు తీసుకున్నారు. ప్రత్యేక అధికారిగా డాక్టర్ విజయ్ బాధ్యతలు చేపట్టడం అంతపూర్ గ్రామస్తులు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఎందుకంటే ఈ డాక్టర్ మద్నూర్ మండలానికి చెందిన వారు కావడం మండలంలోని ప్రతి గ్రామానికి ప్రజలతో మంచి సంబంధాలు ఉండటం అందరితో మంచి చెడు పంచుకోవడం ఆ డాక్టర్ ముఖ్య ఉద్దేశం. అంతాపూర్ గ్రామానికి ప్రత్యేక అధికారిగా నియమితులు కావడం ఆ గ్రామ ప్రజలు ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ, ప్రత్యేక అధికారికి ఘనంగా శాలువులతో సన్మానించి స్వీట్లు తినిపించారు. అనంతరం గ్రామస్తులతో ప్రత్యేక అధికారి డాక్టర్ పంచాయతీ కార్యాలయం ఎదుట మాట్లాడారు .గ్రామపంచాయతీలో ప్రజా సమస్యలు తీర్చడానికి ప్రభుత్వం ప్రత్యేక అధికారిగా తనను నిలిచిందని సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని గ్రామస్తులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గం సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.