
ఆర్ఎంపి & పిఎంపి రామగిరి మండల అధ్యక్షులు డా, బొద్దుల జగదీశ్వర్ తాజా మాజీ ఎంపీపీ ఆరెళ్లి దేవక్క కొమురయ్య గౌడ్ మండలానికి చేసిన సేవలు మరువలేని అని రామగిరి మండల ఆర్ఎంపి పిఎంపి అధ్యక్షులు బొద్దుల జగదీశ్వర్ అన్నారు. సోమవారం రామగిరి మండలంలోని రామయ్య పల్లె గ్రామంలో తాజా మాజీ ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమురయ్యగౌడ్ ఐదు సంవత్సరాల పదవి కాలం పూర్తి అయిన సందర్భంగా మండల ఆర్ఎంపి డాక్టర్ల ఆధ్వర్యంలో పూల బొకే అందజేసి శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానం చేసారు. అలాగే భవిష్యత్తులో మరిన్ని అత్యుత్తమైన పదవులు స్వీకరించాలని వారి కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంపి సంఘం ఉపాధ్యక్షుడు ఈ రమేష్, ప్రధాన కార్యదర్శి వొల్లాల మల్లేష్, కోశాధికారి అనిల్, డివిజన్ ప్రధాన కార్యదర్శి పెండయ్య, అశోక్, సురేష్, ఇజ్జగిరి రాజు, రామ్ చందర్ రెడ్డి, రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.