జాతీయ ఉత్తమ సేవా పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక 

– రక్తదానంలో చేస్తున్న సేవలకు గాను
నవతెలంగాణ –  కామారెడ్డి
జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఈ ఆదివారం నిర్వహిస్తున్న శ్రీ సాయి సేవా భగవాన్ జాతీయ ఉత్తమ సేవా పురస్కారానికి కామారెడ్డి రక్తదాతల సమూహ పౌండర్,ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారికి జయ జయ సాయి ట్రస్ట్ ఫౌండర్,ప్రెసిడెంట్ డాక్టర్ పూసపాటి బాలాజీ ఈ అవార్డులను ఆదివారం రోజున అందజేయడం జరుగుతుందని, వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు మెగా రక్తదాన శిబిరాల నిర్వహణ,వ్యక్తిగతంగా 75 సార్లు రక్తదానం, ఆపదలో ఉన్నవారికి సకాలంలో రక్తాన్ని అందజేస్తున్నందుకుగాను ఈ పురస్కారానికి ఎంపిక చేయడం జరిగిందని, దీనికి సహకరించిన రక్తదాతలకు, మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలను తెలుపుతున్నానరు.