డాక్టర్‌ చిన్నారెడ్డి బాధ్యతల స్వీకరణ

డాక్టర్‌ చిన్నారెడ్డి బాధ్యతల స్వీకరణ– ఎన్నికల కోడ్‌ రాకముందే మిగితా గ్యారంటీల అమలు : డాక్టర్‌ చిన్నారెడ్డి
– ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులుగా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పార్లమెంటు ఎన్నికల కోడ్‌ రాకముందే రాష్ట్రంలో తమ పార్టీ ఇచ్చిన గ్యారంటీల్లో మిగిలిన రెండింటినీ అమలు చేస్తామని డాక్టర్‌ జి.చిన్నారెడ్డి తెలిపారు. గురువారం హైదరాబాద్‌ లోని మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో ఆయన ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మెన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు. ప్రజావాణిలో 4.90 లక్షల ఆర్జీలు వచ్చాయనీ, వాటిలో 4 లక్షల సమస్యలను పరిష్కరించేందుకు ఇప్పటికే చర్యలు తీసుకున్నామని వివరించారు.