
చౌటుప్పల్ మండల కేంద్రంలో వలిగొండ రోడ్డులో ఉన్నా సాయిబాబా గుడిలో ఆదివారం గురుపౌర్ణమి సందర్బంగా డాక్టర్ చినుకని శివప్రసాద్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ హోమియో డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చినుకని శివప్రసాద్ హాజరై మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరికి గురుపౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ,యాదమ్మ,బోయ సంజీవ, పి.ఎస్.ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.