– తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మెన్‌సురేందర్ నాయక్
నవతెలంగాణ -తుంగతుర్తి
డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ గెలుపు తుంగతుర్తి నియోజకవర్గ అభివద్ధికి మలుపు అని తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్‌్ సురేందర్ నాయక్ అన్నారు.బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో అధికారం చెలాయించేందుకు పార్టీలు మారాయి తప్ప ప్రజల బతుకులు మార్చేందుకు ఏ రాజకీయ నాయకుడు కనీసం ప్రయత్నం చేయలేదన్నారు.గతంలో ఇక్కడ రాజకీయ కక్షలు రాజ్యమేలితే రక్తపాతాలు పారేవన్నారు. నేడు కాళేశ్వరం నీళ్లు పారుతున్నాయన్నారు.తుంగతుర్తి నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేయించిన ఘనుడు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అన్నారు.60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తుంగతుర్తి అభివద్ధికి ఆమడ దూరంలో ఉంటే నేడు అభివద్ధిలో పరుగులు పెడుతూ ముందు స్థానంలో ఉందన్నారు. నియోజకవర్గంలో 93 వేల మందికి రైతుబంధు,12,000 మందికి కళ్యాణ లక్ష్మి, 8000 మందికి కేసీఆర్ కిట్లు, పైలెట్ ప్రాజెక్టు కింద తిరుమలగిరి మండలంలో 1100 మందికి దళిత బంధు అందజేశారని తెలిపారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందజేయడం కేసీఆర్ కే సాధ్యమన్నారు.అధికారం కోసం తాపత్రయపడుతున్న నాయకుల కోసం కాకుండా,అభివద్ధి కోసం పోటీపడే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ కు ఓటు వేయాలని కోరారు.