– కృత్రిమ మేధతోనే సమాచార భద్రత రూడీ చేయబడింది: డా.మిథున్ చక్రవర్తి
– స్టాన్లీ మహిళా ఇంజనీరింగ్ కళాశాలాలో అంతర్జాతీయ సదస్సు..
నవతెలంగాణ – ఓయూ
స్టాన్లీ మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో 9వ, రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు రీసెర్చ్ ఇంటిలిజెంట్ కంప్యూటర్ ఇన్ ఇంజినీరింగ్ (RICE-2024) శుక్రవారం ఈ సదస్సు మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, హైదరాబాద్ మరియు యూనివర్సిటీ ఆఫ్ డాన్ బాస్కో ఎల్ సాల్వడార్ సంయుక్తంగా నిర్వహించారు. అంతర్జాతీయ సదస్సు ప్రారంభానికి ముందు అతిథులు దివంగత మాజీ ప్రధానమంత్రి, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతర్జాతీయ సదస్సు (RICE-2024) ను కన్వీనర్ డాక్టర్ ఎం స్వప్న, అసోసియేట్ ప్రొఫెసర్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన డాక్టర్.న్యూఎన్ హంసంగ్( హెడ్, సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్, హనోయ్ యూనివర్సిటీ ఆఫ్ ఇండస్ట్రీ, వియత్నం) మాట్లాడుతూ.. సైన్స్, టెక్నాలజీ అభివృద్ధి అనేది పరస్పరము ఇచ్చిపుచ్చుకోవడం ద్వారానే అభివృద్ధి సాధ్యమన్నారు. కంప్యూటర్ రంగంలో నేడు కృత్రిమ మేధ అనేది ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉందని చెప్పారు. కృత్రిమ మేధవలన ఎన్నో పరిష్కరించడానికి వీలు కానీ సమస్యలను కూడా అతి సులభంగా పరిష్కరించడం జరిగిందని పేర్కొన్నారు.
సాంకేతికత అనేది అన్ని రంగాల అభివృద్ధికి ఎంతో సహకరిస్తుందని చెప్పారు. కృత్రిమ మేధ నేడు సాఫ్ట్వేర్ రంగమే కాకుండా పారిశ్రామిక మరియు వైద్య రంగాలలో అద్భుతంగా ఫలితాలనిస్తోందని ఈ సందర్భంగా అయిన గుర్తు చేశారు. ఈ అంతర్జాతీయ సదస్సుకు మరొక గౌరవ అతిథిగా హాజరైన డాక్టర్ మిథున్ చక్రవర్తి (లింకన్ యూనివర్సిటీ, మలేషియా) మాట్లాడుతూ..గణన శాస్త్రానికి సంబంధించిన పరిశోధనలు ఇంజనీరింగ్ పరిజ్ఞానం పెరగడానికి ఎంతో సహకరిస్తాయని పేర్కొన్నారు. కృత్రిమ మేధవలన నేడు సమాచార భద్రత అనేది రూఢీ చేయబడిందని చెప్పారు. సమాచారాన్ని సేకరించడం మరియు విశ్లేషించడం మొదలగు ముఖ్యమైన పనులను కృత్రిమ మేధ ద్వారా ఎంతో సులభంగా చేయగలమని గుర్తు చేశారు. ఈ సదస్సు లో కృత్రిమ మేదతో కూడిన అనేక అంశాలపై చర్చలు జరగాలని సూచించారు. అంతర్జాతీయ సదస్సు ప్రారంభ కార్యక్రమానికి మరొక వక్తగా హాజరైన డాక్టర్ అతుల్ నేగి (హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ) కార్యక్రమం గురించి ప్రసంగించారు. ఈ రెండు రోజుల సదస్సులో చైర్మన్ బిషప్ డా. ఎం.ఏ. డేనియల్, సెక్రటరీ, కరస్పాండెంట్ కె.కృష్ణా రావు, మేనేజ్మెంట్ సభ్యులు టి రాకేష్ రెడ్డి, ఆర్ ప్రదీప్ రెడ్డి, ప్రిన్సిపాల్ డా. సత్య ప్రసాద్ లంక, అకాడమీక్స్ డీన్ డా. ఎ.వినయ్ బాబు, డాక్టర్ వి.అనురాధ డైరెక్టర్, ఎ. రమేష్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్, ప్రోగ్రామ్ చైర్ డా. విజయేందర్ కుమార్ సోలంకి, కన్వీనింగ్ టీమ్ డా.ఎం.స్వప్న, డా.శివాని యాదవ్,డా.జి.కార్తిక్ విద్యార్థులు, రీసర్చ్ స్కాలర్స్, ఉపాధ్యాయులు హాజరయ్యారు. ప్రిన్సిపాల్ & చైర్ ప్రిన్సిపాల్ & చైర్, RICE-2024 డా.సత్య ప్రసాద్ లంక, అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్ ఎ. రమేష్, పాల్గొన్నారు.