రాష్ట్ర ఉపాధ్యక్షునిగా డాక్టర్ జంగం గంగాధర్

Dr. Jangam Gangadhar as State Vice Presidentనవతెలంగాణ – బాన్సువాడ నసురుల్లాబాద్ 
తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా బాన్సువాడ తొలి మున్సిపల్ చైర్మన్ డాక్టర్ జంగం గంగాధర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బాన్సువాడ పట్టణ కాంగ్రెస్ సీనియర్ నేత ఎండి దావూద్ ఎన్నికైన జంగం గంగాధర్ ను ఘనంగా సన్మానించారు. అలాగే బాన్సువాడ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ మున్సిపల్ పాలకవర్గ కొందరు సభ్యులు ఘనంగా సన్మానిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఎన్నిక పట్ల పద్మశాలి సంఘం నాయకులు జిల్లా కాశీనాథ్, గూడ శ్రీనివాస్, గొంట్యాల బాలకృష్ణ, రామచందర్, కౌన్సిలర్ శ్రీనివాస్, నందల శంకర్, గోస్కె సాయి ప్రసాద్, పట్టణ పద్మశాలీ సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.