నవతెలంగాణ – ఐనవోలు: పున్నెల్ గ్రామంలో నిర్వహించిన గడప గడపకు కాంగ్రెస్ 6 గ్యారంటీ పథకాల కార్యక్రమానికి ముఖ్య అతిధి పాల్గొన్న వర్ధన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ జన్ను పరంజ్యోతి కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీల కరపత్రాలను గడప గడపకు అందజేస్తూ కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన వెంటనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. డాక్టర్ జన్ను పరంజ్యోతి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ డిక్లర్ చేసిన ఆరు హామీలను ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇల్లందుల సారయ్య, మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇల్లందుల ఎలీషా, మాజీ ఉపసర్పంచ్ నర్సయ్య, బాబు, ఇల్లందుల కొమురయ్య, ఎడ్ల రాములు, మామునూరి అశోక్, నాయకులు, కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.