7న బీసీల ఆత్మగౌరవ సభ: డాక్టర్‌ కె.లక్ష్మణ్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బీసీల ఆత్మగౌరవ సభను ఈ నెల 7న హైదరాబాద్‌ లో నిర్వహిస్తున్నామనీ, ఈ సభలో పీఎం మోడీ ముఖ్యఅతిథిగా పాల్గొంటారనీ బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ తెలిపారు. శనివారం హైదరాబాద్‌ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అదే విధంగా 11న నిర్వహించనున్న బహిరంగసభలోనూ పీఎం పాల్గొంటారని తెలిపారు. బీసీని ముఖ్యమంత్రి చేస్తామనే చారిత్రక నిర్ణయాన్ని బీజేపీ ప్రకటించిందనీ, రాష్ట్ర ప్రజలకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు.