భువనగిరి మండలంలోని వీరవెల్లి గ్రామంలో భువనగిరి జిల్లా కేంద్రంలోని కస్తూరి హస్పటల్ అధినేత డాక్టర్ కస్తూరి లక్ష్మీనారాయణ శుక్రవారం పాఠశాల విద్యార్థులకు డ్రెస్ మెటీరియల్, పెన్, పెన్సిల్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన సొంత గ్రామం కావడంతో విద్యార్థులకు తన వంతు సహకారంగా డ్రెస్ మెటీరియల్స్, ఇతర సామాగ్రి అందజేసినట్లు తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్యాంసుందరి, తాజా మాజీ సర్పంచ్ తంగిలపల్లి కల్పనా శ్రీనివాసచారి, తాజా మాజీ ఎంపీటీసీ కంచి లలిత మల్లయ్య, విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.