– జిల్లా కలెక్టర్ హనుమంతు కె జండాగె
నవతెలంగాణ – భువనగిరి రూరల్
రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళ సై సౌందర రాజన్ రేపు డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య గ్రంథాలయం భవనాన్ని ప్రారంభిస్తారని జిల్లా కలెక్టర్ హనుమంతు కే జెండగే ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.19వ తేది సోమవారం నాడు ఉదయం 11.30. గంటలకు హైదరాబాదు నుండి బయలుదేరి మధ్యాహ్నం 1.00 గంటలకు రామన్నపేట మండలం వెల్లంకి గ్రామం చేరుకొని “డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య గ్రంథాలయం” భవనానికి ప్రారంభోత్సవం గావిస్తారని, అనంతరం తిరిగి మధ్యాహ్నం 2.00 గంటలకు హైదరాబాద్ రాజ్ భవన్ బయలుదేరి వెళతారని ఆయన తెలిపారు.