డాక్టర్ మొహమ్మద్ ముస్తాక్ అలీ ఎమ్మెల్సీ నామినేషన్ దాఖలు

నవతెలంగాణ – కరీంనగర్ 
కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి డాక్టర్ మొహమ్మద్ ముస్తాక్ అలీ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ అనంతరం విలేకర్లతో మాట్లాడిన ఆయన, గ్రాడ్యుయేట్ల హక్కుల పరిరక్షణ, ఉద్యోగ అవకాశాల పెంపు, విద్యా వ్యవస్థ బలోపేతం నా ప్రధాన లక్ష్యాలు. యువత భవిష్యత్తును మెరుగుపరచడానికి ఇదే సరైన సమయం అని తెలిపారు.
యువత కోసం ప్రత్యేక కార్యాచరణ
డాక్టర్ ముస్తాక్ అలీ తన ఎన్నికల ప్రధాన అజెండాను వివరిస్తూ, నైపుణ్య అభివృద్ధి, విద్యా సంస్కరణలు, పారదర్శక పాలన, విద్యార్థుల శ్రేయస్సుపై దృష్టి సారిస్తానని స్పష్టం చేశారు. యువత కోసం ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, కొత్త అవకాశాల సృష్టికి కృషి చేయడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని తెలిపారు. విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో వసతుల మెరుగుదల, పరిశోధన అవకాశాలకు ప్రోత్సాహం ద్వారా విద్యాసంస్కరణ తీసుకొస్తానని పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్ల సమస్యలను అధికార యంత్రాంగానికి సమర్థవంతంగా వినిపించేందుకు కృషి తో పాటు
 పారదర్శక పాలన అందిస్తామన్నారు.విద్యార్థులకు మద్దతుగా స్కాలర్‌షిప్‌లు, ఆర్థిక సహాయ పథకాలను మరింత బలోపేతం చేయడం.ఈ ఎన్నిక గ్రాడ్యుయేట్ల భవిష్యత్తును నిర్ణయించే అత్యంత కీలకమైనదన్నారు. ప్రతి ఓటు విలువైనదని, సరైన నాయకుడిని ఎన్నుకోవడం అవసరం  అన్నారు.
ఈ సందర్భంగా ఆయన తనకు మద్దతుగా నిలిచే గ్రాడ్యుయేట్లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు ఈ ఎన్నిక తనకు వేదికగా నిలవనుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు మద్దతుదారులు గ్రాడ్యుయస్ పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.