ప్రజల ఆర్యోగం కోసమే ఉచితం వైద్య శిబిరం: డాక్టర్ నగేష్

నవతెలంగాణ -పెద్దవూర
ప్రజల ఆర్యోగం కోసమే ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు మండల వైద్యాధికారి డాక్టర్‌ నగేష్ తెలిపారు.గురువారం మండలంలోని పెద్దగూడెం గ్రామంలో జెడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాల లో ఉచిత వైద్య విబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరానికి మంచిస్పందన వచ్చి న‌ట్లు ఆయన వివరించారు.దీంతో పాటు గ్రామంలోని ప్రజలందరు వివిధ రకలైన వ్యాధులతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారికి ఉచితంగా గ్రామంలోని ప్రతి ఒక్కరికి బీపీ, షూగర్‌, ఈసీజీ, గుండె సబంధిత పరీక్షలు, లెన్స్​‍ అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా అందజేశామని చెప్పారు. 130 మందికి పరీక్షలు అందించడంతో పాటు అవసరమైన అన్ని పరీక్షలు ఉచితంగా చేశామని వివరించారు.సీజనల్ వ్యాధులు రాకుండా ఉచిత క్యాంపు ఏర్పాటు చేసి ఆరోగ్య గ్రామంగా తయారు చేస్తానని తెలిపారు. మండలంలోనిప్రతి గ్రామ పంచాయతీలలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలు ఆరోగ్యంగా ఉండే విధంగా సూస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమం లో పంచాయతీ కార్యదర్శి కార్తీక్ రెడ్డి, సీహెచ్ఓ శ్రీనివాస్, ఎంఎల్ హెచ్ పీ శ్రరణ్య, ఏఎన్ఎం ధనమ్మ,అంగన్వాడీ టీచర్ హేమలత, సుష్మ, హెచ్ఓడి సత్యం, గ్రామస్తులు
పాల్గొన్నారు.