నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులర్ డైరెక్టర్‌గా డాక్టర్ నరేంద్ర కుమార్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ప్రస్తుతం ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నారు. మెడికల్ ఎడ్యుకేషన్ అకాడమిక్ డైరెక్టర్‌గా డాక్టర్ శివరామ్ ప్రసాద్‌ను నియమించా రు. ఆయన ప్రస్తుతం జగిత్యాల మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా, అకాడమిక్ ఇన్‌చార్జి డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర విభజన తర్వాత ఉద్యోగాల పంపకంలో డీఎంఈ పోస్ట్ ఆంధ్రప్రదేశ్ కు వెళ్లింది. పోస్ట్ క్రియేట్ చేయకుండా, ఇన్‌చార్జి ఏర్పాట్లతోనే నెట్టుకొచ్చింది. పదేండ్ల తర్వాత పోసు ్టను క్రియేట్ చేసి, సీనియర్ అడిషనల్ డీఎంఈని రెగ్యులర్ డీఎంఈగా ప్రస్తుత ప్రభుత్వం నియమించింది.
ప్రభుత్వానికి కృతజ్ఞతలు :డాక్టర్ రాజీవ్
రెగ్యులర్ డీఎంఈని నియమించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు, జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ మాజీ అధికార ప్రతినిధి డాక్టర్ రాజీవ్ కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఇన్‌చార్జి డీఎంఈల ఆధ్వర్యం లో వ్యవహారాలు నడపడంతో పరిపాలనా సమస్య లు ఉత్పన్నమయ్యాయని గుర్తుచేశారు. ఈ సమస్య కు శాశ్వత పరిష్కారం చూపుతూ అర్హతలు, సీనియా ర్టీ ఆధారంగా ప్రథమ స్థానంలో ఉన్న నరేంద్ర కుమార్ నియామకం ప్రభుత్వ నిబద్ధత, వైద్యారోగ్య శాఖలో పారదర్శకత, సమర్థత, స్థిరత్వం పెంచే దిశగా ఉందని కొనియాడారు. ఈ చర్య వైద్యరంగం లో నాణ్యతను మెరుగుపరిచేందుకు, ఉద్యోగుల్లో నమ్మకాన్ని పెంచేందుకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. డాక్టర్ నరేంద్రకుమార్‌కు అభినందనలు తెలిపారు.
అభినందనలు…కృతజ్ఞతలు
తెలంగాణలో తొలిసారిగా రెగ్యులర్ డీఎంఈగా నియమితులైన డాక్టర్ నరేంద్ర కుమార్‌ను తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం అభినందించింది. సీఎం రేవంత్ రెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపిం ది. డాక్టర్ శివరాం ప్రసాద్‌కు శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్షులు డాక్టర్ నరహరి, సెక్రెటరీ జనరల్ డాక్టర్ లాలు ప్రసాద్ రాథోడ్, కోశాధికారి డాక్టర్ ఎం.కె.రవూఫ్ తదితరులు నరేంద్రకుమా ర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.