ప్రభుత్వ ఆసపత్రి సూపర్డెంట్ గా డాక్టర్ పి శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ 

నవతెలంగాణ కంఠేశ్వర్ 

నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటెండేంట్ గా ప్రొ. డాక్టర్ పి శ్రీనివాస్ భాధ్యతలు స్వీకరించారు. జిజిహెచ్ లో మంగళవారం ఉదయం ఇంచార్జీ సూపరింటెండేంట్ డాక్టర్ ప్రతిమా రాజ్ నుంచి డా.శ్రీనివాస్ భాధ్యతలు స్వీకరించారు. జిజిహెచ్ ఇంచార్జీ సూపరింటెండెంట్ గా ఉన్న ప్రతిమారాజ్ ను తొలిగించి అక్కడే పిల్లల వైధ్య నిపుణులుగా ఉన్న శ్రీనివాస్ ను ఇంచార్జీగా నియమిస్తు సోమవారం వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్రూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. జిజిహెచ్ సూపరింటెండెంట్ గా భాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ ను ప్రొఫేసర్లు, వైద్యులు, జూడాలు, ఆసుపత్రి సిబ్బంది పుష్ప గుచ్చాలు అందచేసి శుభాకాంక్షలు తెలిపారు.