పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి: డా. పెండెం కృష్ణ కుమార్

నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
పర్యవరణ పరి  రక్షణ కోసం,  ప్లాస్టిక్ రహిత సమాజము కొరకు క్లాత్ బ్యాగ్ లను వాడాలని, నీటిని పొదుపు గా వాడటం, మొక్కలు నాటి సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నాలుగు సార్లు పొందిన  సమాజ సేవకులు, ప్రముఖ  కళాకారులు,  రచయిత  డా. పెండెం కృష్ణ కుమార్ అన్నారు. బుధవారం ఆయన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కు  క్లాత్ బ్యాగులను అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాష్ట్రపతి   ద్రౌపది మురుము  ప్రత్యేకంగా ఢిల్లీ లోని రాష్టప్రతి భవన్ నందు అరగంట సమావేశం  చేస్తున్న సేవలకు అభినందించారనీ తెలిపారు. ఇప్పటికే 333 పాత్రల్లో తాను నటించినట్లు పేర్కొన్నారు.అంతేకాకుండా ఎన్నో ప్రభుత్వ పాఠశాలలో, డెఫ్ అండ్ డాం, బ్లైండ్ పాఠశాల లో అవసరమైన సామగ్రినీ సొంత నిధులతో అందించానని, రక్త దానాలు, చలివేంద్రాలు, అన్నదానాలు, మెడికల్ కాంప్ లు వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు  చేస్తున్నట్లు తెలిపారు.