మండలంలోని బీజేపీ కార్యకర్తలు ఏ ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటానని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి అన్నారు. ఇటివలే బీజేపీ మండల సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ భార్యా భవాని రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలుసుకొని బుధవారం దినేష్ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్ గౌడ్, బీజేపీ మండల అధ్యక్షులు బలవంతుల రాజు, మాజీ మండల అధ్యక్షులు ఇర్సడ్ల సదానందం, ఆర్టిఐ జిల్లా కన్వీనర్ ఎదులాపురం శ్రవణ్, కుమార్ బీజేవైఎం మండల అధ్యక్షులు పోరెడ్డి ప్రదీప్ రెడ్డి ,బత్తుల సుమంత్ భూత్ అధ్యక్షులు పిసాల సాంబయ్య కోరుకొప్పుల ప్రశాంతు బలబద్ర సాయిరాం బలబద్ర రమేష్ సభ్యులు పాల్గొన్నారు.