మాలలను ఎదుర్కొనే శక్తి లేకనే మందకృష్ణ మాదిగ లక్ష డబ్బులు వేలగుంతుల కార్యక్రమం చేపట్టారని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి అన్నారు. శుక్రవారం ఉప్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ సెమినార్ హాల్లో నిర్వహించిన విద్యార్థి యువగర్జన సభ సన్నాక సమావేశం తాళ్ల అజయ్, పాల్వాయి నాగేష్, బోరెల్లి సురేష్ అధ్యక్షతన జరగగా.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ పిడమర్తి రవి మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుముఖంగా ఉన్నారని అలాంటి ముఖ్యమంత్రి ని బిజెపి మాయలో పడి విమర్శించడం మాదిగ సంఘాల నాయకులకు మందకృష్ణ మాదిగకు సమంజసం కాదు అని అన్నారు. వర్గీకరణ చేయని బిజెపి పాలిత రాష్ట్రాలలో ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదని అన్నారు. వర్గీకరణ కోసం కార్యచరణ ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మీద మందకృష్ణ మాదిగ బిజెపి మూసుకులో విషం కక్కుతున్నారని అన్నారు. మాలలకు మందకృష్ణ మాదిగ భయపడుతున్నాడని అన్నారు. వర్గీకరణ ఉద్యమం చేసిన మాదిగలు చాలామంది వృద్ధులుగా మారారని వారి సంక్షేమం కోసం ఏ ఒక్కరోజు మందకృష్ణ మాదిగ ప్రభుత్వంతో కలిసి వాదనలు వినిపించలేదని అన్నారు.ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణంలో ఫిబ్రవరి 2న, మాదిగ విద్యార్థి యువజన ప్రజాసంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన మాదిగ విద్యార్థి యువగర్జన సభను జయప్రదం చేయాలని అన్నారు. మాదిగ వర్గీకరణ ఉద్యమంలో విద్యార్థులు భాగస్వామ్యం కావడం ఎంతైనా అవసరమని అన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మల్లేశం,ప్రొ. డాక్టర్ మనోహర్, ప్రొ. డాక్టర్ కొమ్ము కిరణ్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ నండ్రు నరసింహ, మాదిగ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డ యాదయ్య,మాదిగ జెసి యూత్ కోఆర్డినేటర్ వడ్డె ఎల్లయ్య, మాదిగ విద్యార్థి చేసి రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ రామగల సుందర్, మాదిగ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు దర్శన్ జాన్,ఎమ్మార్పీఎస్ నాయకులు బోయిని ఎల్లేష్, స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు చాగంటి రాజేష్, నవీన్ రాజు, మాదిగ జేఏసీ యూత్ అధ్యక్షులు నక్క మహేష్,బోర్ర సురేష్, డాక్టర్ సుమన్, కొత్తపల్లి కృష్ణ, బీఎస్ఎఫ్ నాయకులు కల్వకుర్తి శ్రీశైలం, ఆరె కంటి శ్రీకాంత్, జోగు గణేష్,గండి శ్రీనివాస్, మీసాల మహేష్ , పాల్గొన్నారు.