వైద్య సేవల్లో నర్సుల పాత్ర కీలకం: డా. రాజేంద్రనాథ్

నవతెలంగాణ – సుల్తాన్ బజార్ 
వైద్య సేవల్లో నర్సుల పాత్ర కీలకమని కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రనాథ్ అన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం  సందర్భంగా ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్రపటానికి పూలమాలవేసి క్యాండిల్స్ వెలిగించి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో వైద్యులతో సమానంగా నర్సులు సేవలందించిందినట్లు గుర్తు చేసుకున్నారు.రోగుల పట్ల సేవ భావంతో ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఫ్లోరెన్స్ నైటింగేల్ సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఆర్ ఎం ఓ డాక్టర్ సూర్య శ్రీ , సివిల్ సర్జన్ డాక్టర్ మల్లికార్జున్, నర్సింగ్ సూపర్డెంట్ ఎస్తర్, రజియా, హెల్త్ ఇన్ స్పెక్టర్ పాలిన, సూపర్వైజర్ సహేదా, ఐ సి ఎస్ ఆఫీసర్ శైలజ, హెడ్ నర్సింగ్ ఆఫీసర్లు శోభారాణి, ఊర్మిళాదేవి అంజలినా, నర్సింగ్ ఆఫీసర్ లు ఎం జయలీల, సైదమ్మ కే జ్యోతి గంగాసాగర్, విజయలక్ష్మి, పెద్ద ఎత్తున వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.