డాక్టర్‌..రామ్‌చరణ్‌

కథానాయకుడు రామ్‌ చరణ్‌కి మరో అరుదైన గౌరవం లభించింది. చెన్నైకు చెందిన ప్రముఖ వేల్స్‌ యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను అందిస్తోంది. ఈ యూనివర్సిటీ అందిస్తున్న డాక్టరేట్‌తో ఆయన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, డైరెక్టర్‌ శంకర్‌ వంటి వారి సరసన చేరటం విశేషం. సినిమా, దాన్ని మించిన ఆయన ప్రభావమే ఈ డాక్టరేట్‌ అందుకోవడానికి కారణమని యూనివర్సిటీ ప్రతినిధులు తెలిపారు. వివిధ రంగాల్లో విశిష్ట వ్యక్తులను గుర్తించి వారికి గౌరవ డాక్టరేట్స్‌ ఇవ్వటంలో వేల్స్‌ యూనివర్సిటీ ప్రసిద్ధి చెందింది. ఈ ఏడాదికిగానూ ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ఎంటర్‌ప్రెన్యూరర్‌గా రామ్‌ చరణ్‌ చేసిన సేవలకు వేల్స్‌ యూనిర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను అందచేస్తోంది. ఈ వేడుక ఈనెల 13న గ్రాండ్‌గా జరగనుంది. తమ అభిమాన హీరోకు దక్కిన గౌరవానికి రామ్‌చరణ్‌ అభిమానులు ఎంతో సంతోషంగా ఉన్నారు.