నవతెలంగాణ-సూర్యాపేట
కొన్ని రోజులుగా బీఆర్‌ఎస్‌పార్టీలో అసంతప్తిగా ఉన్న డాక్టర్ ఊర రామ్మూర్తి పార్టీ మారతున్నారనే ప్రచారం బహిరంగంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో ఆయన దారి ఎటూ అనే దానిపై జిల్లా కేంద్రంలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.ఊర రామ్మూర్తి యాదవ్ గత కొన్ని సంవత్సరాలుగా పట్టణంలో వైద్య వత్తి తో జిల్లా వ్యాప్తంగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ మంచి ”హస్తావాసి” గా పెరుగాంచారు. వైద్య వత్తి ని కొనసాగిస్తూనే రాజకీయాలపై ఆసక్తి చూపేవారు. ఇదిగాక ఆనాడు సిపిఐఎం శాసన సభ్యులు నోముల నర్సింహయ్య చెల్లెలు గాయత్రి ని వివాహం చేసుకోవడంతో రాజకీయాల పట్ల ఆయనకు మరింత ఆసక్తి పెరిగింది. ఆనాడు తెలుగుదేశం పార్టీ నుండి ఆయన భార్య గాయత్రీ కౌన్సిలర్ గా పోటీ చేసి గెలుపొందారు.దీంతో ఆయన రాజకీయాలకు మరింత దగ్గరకు అయ్యారు. ఒకవైపు వైద్య వత్తి ని చూసుకుంటూనే వార్డులో ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కషి చేసే వారు.కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన టిడిపి లో కొనసాగలేక పోయారు. ఈ క్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి ఆహ్వానం మేరకు గత 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన బి.ఆర్.యస్ లో చేరారు.ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలతో మంచి సంబంధాలు ఉన్న డాక్టర్ మంత్రి గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజలకు అర్ధం అయ్యే బాష లో మాట్లాడి ఆకట్టుకునేవారు.ఆ ఎన్నికల్లో మంత్రి జగదీష్ రెడ్డి గెలవడం ఆ తర్వాత కొన్ని రోజులకె మున్సిపల్ ఎన్నికలు రావడం తెల్సిందే.కాగా చైర్మన్ స్తానం మహిళా జనరల్ కావడంతో రామ్మూర్తి తన భార్య గాయత్రీ ని వార్డు కౌన్సిలర్ గా బరిలో దించారు.కాగా ఆరోజు కొందరు సహకరించక పోవడంతో ఆమె ఓటమి చెందారు.ఓటమితో ఆశించిన చైర్మన్ పదవి దక్కక పోవడంతో ఆయన కొన్ని రోజులు కలత చెందారు.అనంతరం ఆయన తిరిగి పార్టీ లో యాక్టివ్ గా మారారు. అనంతరం వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో మంత్రి తో కలిసి పనిచేశారు.ఇదిగాక శ్రీకష్ణ ట్రస్ట్ చైర్మన్ గా యాదవ సామాజిక వర్గానికి చెందిన కార్యక్రమాలను రాష్ట్ర, జిల్లా స్థాయిలో నిర్వహించి పట్టు సాధించారు. అదేవిధంగా బిసి సంఘానికి మద్దతు తెలుపుతూ పలు కార్యక్రమాలలో పాల్గొనే వారు. ఐఎంఏ అధ్యక్షులు గా వైద్యుల సమస్యల సాధన లో ముందు ఉండేవారు. ఈ నేపథ్యంలో ఆయన బి.ఆర్.యస్ లో నామినేటెడ్ పదవిని ఆశించినట్లు ప్రచారం సాగింది.మంత్రి కి ఆయన కు మధ్య పదవిపై ఎలాం చర్చలు జరిగాయో కానీ డాక్టర్ మాత్రం కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ”న్యూట్రల్” గా ఉంటు వస్తున్నారు.కాగా ఇటీవలే ఆయన పార్టీ ని వీడుతున్నారనే ప్రచారం నడుస్తోంది.దీంతో అధికార పార్టీలో కొందరు డాక్టర్ ని బుజ్జగించారు.ఇలా కాలక్రమంలో అసెంబ్లీ ఎన్నికలు షురూ కావడంతో వివిధ పార్టీల నుండి పోటీ చేసే అందరి దష్టి రామ్మూర్తి డాక్టర్ పై పడ్డది.ఈ క్రమంలో మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి డాక్టర్ నివాసానికి చేరుకొని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తుంది.పటేల్ రమేష్ రెడ్డి కి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ దక్కితే ఆయన కు మద్దతుగా డాక్టర్ పని చేస్తారనే ప్రచారం కూడా వెలువడింది. ప్రస్తుతం తాజాగా తన సామాజిక వర్గానికి చెందిన వట్టే జానయ్య యాదవ్ బీఎస్పీ పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. జానయ్య కూడా పార్టీలో చేరమని సన్నిహితుల ద్వారా రామ్మూర్తి పై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.తాము గెలిస్తే ఉన్నత పదవి ఇస్తామని పలువురు అభ్యర్థులు ఆఫర్లు ఇస్తున్నట్లు తెలిసింది. ఈ విధంగా రకరకాల ఊహాగానాల నేపథ్యంలో డాక్టర్ రామ్మూర్తి రాజకీయంగా అధికార పార్టీలోనే కొనసాగుతారా..? లేక తనకు ప్రాధాన్యత కల్పించే పార్టీలో చేరుతారా వేచి చూడాలి.